రాహుల్ అరుదైన ఘనత | kl rahul gets rare feat | Sakshi
Sakshi News home page

రాహుల్ అరుదైన ఘనత

Mar 26 2017 3:40 PM | Updated on Sep 5 2017 7:09 AM

రాహుల్ అరుదైన ఘనత

రాహుల్ అరుదైన ఘనత

భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ధర్మశాల:భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ అర్ధ శతకం సాధించాడు.  తద్వారా ఒక సిరీస్ లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించిన రెండో భారత ఓపెనర్గా రాహుల్ గుర్తింపు సాధించాడు.

అంతకుముందు మురళీ విజయ్ యాభైకి పైగా పరుగుల్ని ఐదు సార్లు సాధించిన తొలి భారత ఓపెనర్. 2014-15 సీజన్లో విజయ్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా రాహుల్ ఆ మార్కును చేరడంతో విజయ్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.  తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్, రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement