ఐపీఎల్‌లో విలియమ్సన్‌ తొలిసారి.. | Kane Williamson gets first duck in IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో విలియమ్సన్‌ తొలిసారి..

Apr 26 2018 8:25 PM | Updated on Apr 26 2018 8:59 PM

Kane Williamson gets first duck in IPL - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చరిత్రలో తొలిసారి కేన్‌ విలియమ్సన్‌ డకౌట్‌గా నిష్క్రమించాడు. గురువారం కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో విలియమ్సన్‌ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరాడు. మూడు బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్‌.. అన్‌కిత్‌ రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా ఔటయ్యాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో విలియమ్సన్‌ మొదటిసారి డకౌట్‌గా పెవిలియన్‌ చేరిన అపప్రథను సొంతం చేసుకున్నాడు. దాంతో 1 పరుగు వద్ద సన్‌ రైజర్స్‌ తొలి వికెట్‌ను నష్టపోయింది. కాగా, జట్టు 16 పరుగుల వద్ద ఉండగా శిఖర్‌ ధావన్‌(11) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హైదరాబాద్‌ తొలి రెండు వికెట్లను పంజాబ్‌ బౌలర్‌ అన్‌కిత్‌ రాజ్‌పుత్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement