గూగుల్‌లో అంతా అదే వెతుకులాట!

Indians and Pakistanis are Googling Manchester Weather Report - Sakshi

మాంచెస్టర్‌ వెదర్‌ రిపోర్ట్‌ కోసం దాయాదుల అన్వేషణ

మాంచెస్టర్‌ : భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగుతుందా..!  సగటు క్రికెట్‌ అభిమానిని ఇప్పుడు పీడిస్తున్న ధర్మ సందేహమిది. మాంచెస్టర్‌ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు జట్లు, బలాబలాల సంగతులు ఎలా ఉన్నా ఈ వరల్డ్‌కప్‌ ఫలితాలను వర్షం కూడా శాసిస్తోంది. వాన కారణంగా రద్దయిన నాలుగు మ్యాచ్‌లలో భారత్‌ మ్యాచ్‌ కూడా ఉంది. కివీస్‌తో మ్యాచ్‌ పోయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ మాత్రం కచ్చితంగా జరగాలని అంతా కోరుకుంటున్నారు. అటు పాక్‌ అభిమానులు కూడా అంతే శ్రీలంకతో మ్యాచ్‌ రద్దైనా పట్టించుకోలేదు.

అయితే మాంచెస్టర్‌లో పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఇంగ్లండ్‌లో వాతావరణం గురించి దాదాపు కచ్చితమైన సమాచారం అందించే ఏజెన్సీలు అన్నీ ఆదివారం వర్షం పడుతుందనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అభిమానులు గూగుల్‌లో వెతికేది ఒకటే.. మాంచేస్టర్‌ వెదర్‌ రిపోర్డు. ప్రతి అరగంటకు ఒకసారి సర్చ్‌ చేస్తూ అక్కడి వాతావరణ వివరాలను తెలసుకుంటున్నారు. దీంతో ఇరు దేశాల్లో అతిగా సెర్చ్‌ చేసిన పదంగా మాంచెస్టర్‌ వెదర్‌ రిపోర్ట్‌ నిలిచింది. ఇక ట్విటర్‌లో #IndiaVsPakistan ఎక్కువగా ట్రెండ్‌ అవుతుండగా.. Manchester మూడో స్థానంలో ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top