ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం  | India Prajnesh Gunneswaran enters second round | Sakshi
Sakshi News home page

ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం 

May 22 2018 1:04 AM | Updated on May 22 2018 1:04 AM

India Prajnesh Gunneswaran enters second round - Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పారిస్‌లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ గెలుపొందగా... సుమీత్‌ నాగల్, రామ్‌కుమార్‌ రామనాథన్‌ ఓడిపోయారు.

ప్రజ్నేశ్‌ 6–4, 6–4తో సాల్వటోర్‌ కరూసో (ఇటలీ)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. సుమీత్‌ 6–4, 4–6, 1–6తో మార్టిన్‌ క్లిజాన్‌ (స్లొవేకియా) చేతిలో... రామ్‌కుమార్‌ 3–6, 7–5, 1–6తో జే క్లార్క్‌ (బ్రిటన్‌) చేతిలో ఓటమి చవిచూశారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement