భారత్-పాక్ మ్యాచ్ విశేషాలు
పాకిస్థాన్తో మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులను ఆద్యంతం అలరించింది.
అడిలైడ్: పాకిస్థాన్తో మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులను ఆద్యంతం అలరించింది. భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సత్తాచాటారు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా విఫలమైన ధోనీసేన కీలక సమయంలో పుంజుకుని ప్రపంచ కప్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన గ్రూపు-బి మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ విశేషాలు..
- కోహ్లి రెండు సార్లు క్యాచ్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. షాహిద్ అఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లలోనూ, హారీష్ సొహైల్ వేసిన ఇన్నింగ్స్ 32వ ఓవర్లోనూ కోహ్లీ క్యాచ్ను పాక్ ఫీల్డర్లు జారవిడిచారు.
- వరల్డ్ కప్లో పాకిస్తాన్ పై సెంచరీ చేసిన తొలి భారత్ క్రికెటర్గా విరాట్ (107) ఘనత సాధించాడు.
- విరాట్ వన్డేల్లో 22 వ సెంచరీ చేసి నమోదు చేశాడు.
- అడిలైడ్ లో సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్ కోహ్లీయే. గతంలో సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు ఇదే వేదికపై సెంచరీలు నెలకొల్పారు.
- సురేష్ రైనా (74), ధవన్ (73) హాఫ్ సెంచరీలతో రాణించారు.
- ధవన్, కోహ్లీ రెండో వికెట్కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
- రైనా, కోహ్లీ మూడో వికెట్కు 110 పరుగులు జోడించారు.
- చివరి ఐదు ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 27 పరుగులే చేయగలిగింది.
- పాకిస్థాన్ బౌలర్ సొహైల్ ఖాన్ 5 వికెట్లు తీశాడు.
- పాక్ ఇన్నింగ్స్ 24వ ఓవర్లో ఉమేష్ షెహజాద్, షోయబ్ మఖ్సూద్ను అవుట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు.
- ఇన్నింగ్స్ 35వ ఓవర్లో షమీ అఫ్రీది, రియాజ్ను అవుట్ చేయడంతో పాక్ ఓటమి దాదాపుగా ఖాయమైంది.
- 47వ ఓవర్లో సొహైల్ ఖాన్ ను అవుట్ చేయడంతో పాక్ కథ ముగిసింది.
- పాక్ జట్టులో మిస్బా (76) మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు.


