భారీ గెలుపు దిశగా... | india needs three wickets for big victory aganist srilanka | Sakshi
Sakshi News home page

భారీ గెలుపు దిశగా...

Aug 14 2017 2:03 PM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు భారీ గెలుపు దిశగా సాగుతోంది.



పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు భారీ గెలుపు దిశగా సాగుతోంది. లంకేయుల ఏడు వికెట్లను నేలకూల్చిన భారత జట్టు మరో ఇన్నింగ్స్ విజయాన్ని ఖాతాలో వేసుకోవడానికి స్వల దూరంలో నిలిచింది. 19/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంక.. 138 పరుగులకే ఏడు వికెట్లను నష్టపోయి ఎదురీదుతోంది. ఈరోజు ఆట ప్రారంభమైన తరువాత 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన లంకకు  మాథ్యూస్-చండిమాల్ మరమ్మత్తులు చేశారు.

వీరిద్దరూ 65 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. అయితే లంచ్ బ్రేక్ తరువాత చండిమాల్(36)ను భారత జట్టు పెవిలియన్ కు పంపింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో చండిమాల్ ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఇక అటు తరువాత లంక మాథ్యూస్(35), దిల్రువాన్ పెరీరా(8)ల వికెట్లను కొద్దిపాటి వ్యవధిలో కోల్పోయింది.  ఈ ఏడు వికెట్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు. కుల్దీప్, ఉమేశ్ లకు తలో వికెట్ దక్కింది. ఇంకా శ్రీలంక ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే 201 పరుగులు చేయాల్సి ఉంది.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 487ఆలౌట్

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 135 ఆలౌట్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement