మళ్లీ ఆరు సిక్సులు కొడతా: యువరాజ్ | I will hit six sixes again: Yuvraj to a kid | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆరు సిక్సులు కొడతా: యువరాజ్

May 16 2016 11:29 AM | Updated on Mar 28 2019 6:26 PM

ఇండియన్ క్రికెట్లో ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండి పోయే క్షణాలు యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సాధించినవి.

మొహాలీ: ఇండియన్ క్రికెట్లో ఎప్పటికీ గుర్తుండి పోయే క్షణాలు యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సాధించినవి. అయితే మరోసారి ఈ ఫీట్ సాధిస్తానంటున్నాడు యూవీ. ఆదివారం కింగ్స్ లెవన్ పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 24 బంతుల్లో 42 పరుగులు సాధించి సన్రైజర్స్ జట్టుకు విజయాన్నందించిన యువరాజ్.. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పలువురు క్యాన్సర్ బాధిత చిన్నారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి ' మీరు మరోసారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సాధిస్తారా? అని యువరాజ్ను ప్రశ్నించగా.. 'నీవు ప్రార్థించు, నేను మరోసారి సాధిస్తాను' అంటూ సమాధానం ఇచ్చాడు.

2007లో టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యూవీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు సాధించిన విషయం తెలిసిందే. గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న యువరాజ్.. ఆదివారం 17 మంది క్యాన్సర్ బాధిత చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాడు. యువరాజ్ను కలవడం సంతోషంగా ఉందని, అతడు తనలో స్పూర్తిని నింపాడని క్యాన్సర్తో పోరాడుతున్న ఓ బాలుడు యూవీని కలిసిన ఆనందంలో తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement