హైదరాబాద్‌ ఓటమి | hyderabad defeated in under 23 cricket tourny | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఓటమి

Feb 11 2017 10:21 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఇంటర్‌ జోనల్‌ మహిళల అండర్‌–23 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టుకు పరాజయం ఎదురైంది.

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ జోనల్‌ మహిళల అండర్‌–23 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టుకు పరాజయం ఎదురైంది. తమిళనాడు జట్టుతో కొచ్చిలో జరిగిన ఈ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఓడింది. తొలుత తమిళనాడు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.

 

కెప్టెన్‌ డి. హేమలత (152; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. హైదరాబాద్‌ బౌలర్లలో రచన 3, జి. త్రిష 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 233 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు 49.2 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హిమాని (51) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement