హైదరాబాద్ సూపర్ విక్టరీ | hyderabad clinch big victory against services | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ సూపర్ విక్టరీ

Nov 17 2016 10:31 AM | Updated on Sep 4 2018 5:24 PM

ఒకే రోజు 11 వికెట్లు... సర్వీసెస్‌తో మ్యాచ్‌లో బుధవారం హైదరాబాద్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి మ్యాచ్ దిశనే మార్చేశారు.

ముంబై: ఒకే రోజు 11 వికెట్లు... సర్వీసెస్‌తో మ్యాచ్‌లో బుధవారం హైదరాబాద్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి మ్యాచ్ దిశనే మార్చేశారు. ‘డ్రా’తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనుకున్న చోట బోనస్ పాయింట్ సహా భారీ విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్‌‌సలో చెప్పుకోదగ్గ బ్యాటింగ్ తీరు కనబర్చిన ప్రత్యర్థి, రెండో ఇన్నింగ్‌‌సలో మాత్రం తడబడి మ్యాచ్‌ను అప్పగించేసింది. ఫలితంగా గ్రూప్ ‘సి’ పారుుంట్ల పట్టికలో హైదరాబాద్ ఒక్కసారిగా నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇక్కడ ముగిసిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్‌‌సలో 220 పరుగులు వెనుకబడిన సర్వీసెస్... రెండో ఇన్నింగ్‌‌సలో 239 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్ (4/32), సిరాజ్ (3/59), సీవీ మిలింద్ (2/39) రాణించారు. అనంతరం హైదరాబాద్ రెండో ఇన్నింగ్‌‌సలో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసి విజయాన్నందుకుంది. డబుల్ సెంచరీ హీరో బావనక సందీప్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.

రాణించిన రాహుల్ సింగ్...

 ఓవర్‌నైట్ స్కోరు 360/9తో తొలి ఇన్నింగ్‌‌స ఆట కొనసాగించిన సర్వీసెస్ ఉదయం ఐదో బంతికే చివరి వికెట్ కోల్పోయి అదే స్కోరు వద్ద ఆలౌటైంది. 220 పరుగులు వెనుకబడిన సర్వీసెస్‌ను హైదరాబాద్ ఫాలోఆన్ ఆడించింది. రోజంతా నిలిస్తే మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగిన ఆ జట్టు రెండో ఇన్నింగ్‌‌సలో తడబడింది. తన రెండో ఓవర్ తొలి బంతికి నకుల్ (3)ను అవుట్ చేసిన మిలింద్, మరో రెండు బంతులకే చౌహాన్ (0)ను పెవిలియన్ పంపించాడు. సిరాజ్ బౌలింగ్‌లో కెప్టెన్ గుప్తా ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరగడంతో సర్వీసెస్ స్కోరు 27/3 వద్ద నిలిచింది. ఈ దశలో హైదరాబాదీ రాహుల్ సింగ్ (67 బంతుల్లో 59; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తొలి ఇన్నింగ్‌‌సలో సెంచరీ సాధించిన శంషేర్ యాదవ్ (24) కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 77 పరుగులు జోడించిన అనంతరం రవికిరణ్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. ఆ వెంటనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ కూడా రవికిరణ్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అయితే మరో కీలక భాగస్వామ్యం సర్వీసెస్‌ను నిలబెట్టింది. వికాస్ యాదవ్ (90 బంతుల్లో 47; 8 ఫోర్లు), వికాస్ హాథ్‌వాలా (66 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టును ఓటమినుంచి తప్పించే ప్రయత్నం చేశారు. అయితే భండారి బౌలింగ్‌లో సందీప్‌కు హాథ్‌వాలా క్యాచ్ ఇవ్వడంతో ఈ జోడి విడిపోరుుంది. ఆ తర్వాత లోయర్ ఆర్డర్‌లో ఎవరూ నిలవలేకపోవడంతో సర్వీసెస్‌కు 19 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. అనంతరం అక్షత్ (15 నాటౌట్), థామస్ (4 నాటౌట్) హైదరాబాద్ విజయాన్ని పూర్తి చేశారు. ఈ  సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 2 మ్యాచ్‌లు గెలిచి, 1 మ్యాచ్‌లో ఓడిపోగా, మరో 2 డ్రాగా ముగిశాయి. 17 పాయింట్లతో టీమ్ ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement