అతని ప్రదర్శన అద్భుతం

His performance is awesome - Sakshi

ఇంగ్లండ్‌ టెయిలెండర్ల పోరాటం 86 ఏళ్ల క్రితం మ్యాచ్‌ను గుర్తుకుతెచ్చింది. 1932లో భారత్‌ చరిత్రలో తొలి టెస్టు ఆడుతుండగా... మన బౌలర్లు నిస్సార్, అమర్‌ సింగ్‌లు ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను కూల్చారు. ఇద్దరు కలిసి 5 వికెట్లు తీయడంతో కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆదుకున్నారు. చక్కని భాగస్వామ్యాలతో విలువైన పరుగులు జతచేయడంతో ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓడింది. ఇప్పుడు కూడా ఇంగ్లండ్‌ లోయర్‌ ఆర్డర్‌ అలాగే ఆడింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. తమ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడిపెంచేందుకు అవసరమైన స్కోరును సాధించిపెట్టింది. గత టెస్టులాగే జోస్‌ బట్లర్‌ ఇంగ్లండ్‌ను గట్టెక్కించే బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నాడు.

కష్టమైన బంతుల్ని గౌరవించి, గతి తప్పిన బంతుల్ని శిక్షించి ఇంగ్లండ్‌ స్కోరును పెంచాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్‌ ను ఆస్వాదించాడు. ఒక్కో పరుగును జతచేసి పటిష్ట భాగస్వామ్యంతో లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. అందువల్లే బ్రాడ్‌ కూడా క్రీజులో పాతుకుపోయి ఆడగలిగాడు. దీంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో కెరీర్‌ చివరి టెస్టు ఆడుతున్న కుక్‌తో పాటు మొయిన్‌ అలీ భారత బౌలర్లను బాగా ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరి నిష్క్రమణ తర్వాత బుమ్రా, ఇషాంత్‌లు బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వకుండా చక్కగా బౌలింగ్‌ చేశారు. కానీ ఏడు వికెట్లదాకా బాగానే ఉన్నా... అలసత్వంతో లోయర్, టెయిలెండర్లను  పెవిలియన్‌ చేర్చలేకపోయారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top