బౌలర్ల వైఫల్యం వల్లే.. | Gujarat Lions skipper Suresh Raina blames bowlers for loss to Delhi Daredevils | Sakshi
Sakshi News home page

బౌలర్ల వైఫల్యం వల్లే..

May 5 2017 7:02 PM | Updated on Aug 21 2018 2:28 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గురువారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమిని ఎదుర్కోవడానికి తమ బౌలర్ల వైఫల్యమే ప్రధానకారణమని గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా విమర్శించాడు.

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గురువారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమిని ఎదుర్కోవడానికి తమ బౌలర్ల వైఫల్యమే ప్రధానకారణమని గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా విమర్శించాడు. ఆ మ్యాచ్ లో భారీ స్కోరు చేసే కూడా దాన్ని కాపాడుకోలేదంటే అందుకు బౌలర్లనే నిందించకతప్పదన్నాడు.

 

' మేము అస్సలు బౌలింగ్ బాగాచేయలేదు. పాత బాల్ ను వినియోగించుకోవడంలో మా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. గత మ్యాచ్ ల్లో ఆండ్రూ టై చాలా బాగా బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ కు దూరం కావడంతో బౌలింగ్ లో మాకు ఆ లోటు కనబడింది. బ్రేవో కూడా మాతో లేడు. దాంతో భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేకపోయాం. ప్రధానంగా స్లో బంతులు,రివర్స్ స్వింగ్ బంతుల్ని ఎక్కువగా సంధిస్తే పరుగుల్ని నియంత్రించే అవకాశం ఉంది. మా బౌలర్లు శత విధాలా ప్రయత్నించినా గేమ్ ను మాత్రం రక్షించలేకపోయారు' అని రైనా అంసతృప్తి వ్యక్తం చేశాడు.


గుజరాత్ లయన్స్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని విసరగా, దాన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ సునాయాసంగా అధిగమించింది. రిషబ్ పంత్(97), సంజూ శాంసన్(61)లు విజయంలో్ ముఖ్య భూమిక పోషించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement