ధోని లేకుంటే చెన్నై ఉత్తదే! | Dissolve Chennai Super Kings After MS Dhoni Retirement | Sakshi
Sakshi News home page

ధోని లేకుంటే చెన్నై ఉత్తదే!

Apr 27 2019 10:39 AM | Updated on Apr 27 2019 10:54 AM

Dissolve Chennai Super Kings After MS Dhoni Retirement - Sakshi

ధోని రిటైర్‌ అయితే చెన్నై జట్టును రద్దు చేసుకోవడం బెటర్‌..

చెన్నై : మహేంద్రసింగ్‌ ధోని లేకుంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ గెలవదా? అంటే గెలువదనే అంటున్నారు.. ఆ జట్టు అభిమానులు. సారథి ధోనిపైనే జట్టంతా ఆధారపడిందని, ఇది అంత మంచిది కాదని మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్‌ ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్న చెన్నైసూపర్‌ కింగ్స్‌.. ఇలానే ఆడితే టైటిల్‌ కొట్టడం కష్టమంటున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 46 పరుగులతో చిత్తవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జ్వరం కారణంగా ఈమ్యాచ్‌కు ధోని దూరం కాగా.. సురేశ్‌ రైనా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అంబటి రాయుడు కీపింగ్‌ చేశాడు. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై జట్టు.. ధోని లేకుంటే మాత్రం గతి తప్పుతుంది. ధోనీ టీమ్‌లో ఉంటే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చే చెన్నై.. అతను గాయం లేదా అనారోగ్యం కారణంగా జట్టుకి దూరమైతే.. ఆ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోతోంది. తాజా సీజన్‌లో ఈ విషయం వరుసగా రెండోసారి స్పష్టమైంది.

ఈ నెల 17న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కి గాయం కారణంగా ధోనీ దూరమవ్వగా.. ఆ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన చెన్నై.. తాజాగా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌కి జ్వరంతో ధోని జట్టులో లేకపోవడంతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇప్పడు ఇదే అంశంపై చెన్నై అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. ఫన్నీ మీమ్స్‌, కామెంట్స్‌తో ఆటగాళ్లను ఆడుకుంటున్నారు. ధోని లేకుంటే చెన్నై జట్టు ఉత్తదేనని, అతను లేకుండా ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదని కామెంట్‌ చేస్తున్నారు. ధోని రిటైర్మెంట్‌ తీసుకుంటే చెన్నైజట్టు రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement