రోహిత్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ | De Kock gets out excellent catch by Rohit | Sakshi
Sakshi News home page

రోహిత్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌

May 1 2018 8:44 PM | Updated on May 1 2018 9:09 PM

De Kock gets out excellent catch by Rohit - Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అదుర్స్‌ అనిపించాడు. ఫీల్డింగ్‌లో ఆడపా దడపా మెరుపులు మెరిపించే రోహిత్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌లో షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో భాగంగా డీకాక్‌ భారీ షాట్‌ ఆడబోయాడు. మెక్లీన్‌గన్‌ వేసిన ఐదో ఓవర్‌ చివరి బంతిని అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌కు సంధించగా,  దాన్ని డీకాక్‌ షాట్‌గా మలిచే యత్నం చేశాడు.

ఆ సమయంలో షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ బంతి కిందపడిపోయే క్రమంలో రెండు చేతులతో చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. దీనికి ఫీల్డ్‌ అంపైర్ల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో రోహిత్‌ థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం కోరాడు. రీప్లేలో తక్కువ ఎత్తులో క్యాచ్‌ను రోహిత్‌ వేళ్ల మధ్య బంధించినట్లు కనబడటంతో డీకాక్‌ భారంగా పెవిలియన్‌ చేరాడు. దాంతో 38 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ను కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement