యువరాణిలా ట్రీట్‌ చేస్తా : క్రికెటర్‌

Cricketer KL Rahul Reacts Dating With Nidhi Agarwal - Sakshi

టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌తో కనిపించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ స్పందించిన విషయం తెలిసిందే. క్రికెటర్‌ రాహుల్‌ కూడా నేడు తమపై వస్తున్న రూమర్స్‌పై స్పందించాడు. మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పాడు. చాలా కాలం నుంచి మాకు పరిచయం ఉందన్నాడు. అంతేకాక నా జీవిత భాగస్వామిని యువరాణిలా ట్రీట్‌ చేస్తానని రాహుల్‌ తెలిపాడు.

‘ ఆమె నాకు చాలా కాలం నుంచి తెలుసు. మేమిద్దరం ఒకే సిటీ నుంచి వచ్చాం. ఆమె తన రంగంలో ముందుకు వెళ్లడం చాలా సంతోషం. నేను క్రికెటర్‌ కాకముందు నుంచి, ఆమె హీరోయిన్‌ అవ్వకముందు నుంచే ఇద్దరికి పరిచయం ఉంది. మేమిద్దరమే కాదు బెంగళూరుకి చెందిన స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లాం. నేను మీకు ఏమి జరగలేదని గ్యారంటీ ఇస్తున్నాను. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అందరికీ తెలిసేలా చేస్తాను. నా జీవిత భాగస్వామిని యువరాణిలా చూసుకుంటాను. అంతేకానీ ఏ విషయాన్ని కూడా దాచను’ అని క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు. ఈ విషయాలను కేఎల్‌ రాహుల్‌ ఓ జాతీయ మీడియా సమావేశంలో తెలిపాడు.

ఐపీఎల్‌లో తన బ్యాట్ ఝులించి క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించాడు. ఐపీఎల్‌-11వ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top