పూజారా సెంచరీ: పటిష్ట స్థితిలో భారత్ | Chesteshwar Pujara gets century, India eye challenging target for South Africa | Sakshi
Sakshi News home page

పూజారా సెంచరీ: పటిష్ట స్థితిలో భారత్

Dec 20 2013 8:42 PM | Updated on Sep 2 2017 1:48 AM

పూజారా సెంచరీ: పటిష్ట స్థితిలో భారత్

పూజారా సెంచరీ: పటిష్ట స్థితిలో భారత్

దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆటగాడు చటేశ్వర పూజారా సెంచరీతో ఆకట్టుకున్నాడు.

జోహన్స్బర్గ్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆటగాడు చటేశ్వర పూజారా సెంచరీతో ఆకట్టుకున్నాడు. 36 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు పూజారా చక్కటి పునాది వేశాడు. ప్రస్తుతం పుజారా(120), కోహ్లి(54) పరుగులతో క్రీజ్లో ఉన్నారు.  రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 244 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు  శిఖర్ థావన్ (15), మురళీ విజయ్ (39) పరుగులకే పెవిలియన్కు చేరారు.

 

అంతకుముందు భారత్ బౌలర్లు జూలు విదల్చడంతో సఫారీలు చతికిలబడ్డారు. భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ తమ మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులకే ఆలౌటయ్యారు. ఇషాంత్ శర్మ కట్టుదిట్టమైన బౌలింగ్ కు , వెటరన్ ఆటగాడు జహీర్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. సౌతాఫ్రికా ఆటగాళ్లలో గ్రేమ్ స్మిత్ (68), ఆమ్లా(36), పీటర్ సన్ (21), ఫిలిండర్ (59) పరుగుల మినహా పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేదు. మరో భారత్ బౌలర్ మహ్మద్ సమీకి రెండు వికెట్లు దక్కాయి.


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement