
బర్మింగ్‌హామ్: టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తన వన్డే కెరీర్‌లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చహల్ పది ఓవర్లు బౌలింగ్ వేసి 88 పరుగులిచ్చాడు. ఇది చహల్‌కు వన్డేల్లో చెత్త ప్రదర్శనగా నమోదైంది. గతంలో వన్డే ఫార్మాట్‌లో ఎప్పుడూ చహల్ ఇంత భారీగా పరుగులు ఇవ్వలేదు. కాగా, ఈ వన్డే వరల్డ్‌కప్‌లో ఇది మూడో చెత్త ప్రదర్శనగా నమోదైంది. అంతకముందు ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(110 పరుగులు-ఇంగ్లండ్‌పై), శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్(88-ఆస్ట్రేలియా)లు అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు. ఆ తర్వాత స్థానం చహల్‌దే కావడం గమనార్హం.