నిలకడగా ఆసీస్ బ్యాటింగ్ | australia steady batting after warner innigs comes to end | Sakshi
Sakshi News home page

నిలకడగా ఆసీస్ బ్యాటింగ్

Nov 14 2016 3:00 PM | Updated on Sep 4 2017 8:05 PM

నిలకడగా ఆసీస్ బ్యాటింగ్

నిలకడగా ఆసీస్ బ్యాటింగ్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది.

హోబార్ట్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. మూడో రోజు లో భాగంగా సోమవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(56 బ్యాటింగ్), కెప్టెన్ స్టీవ్ స్మిత్(18 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(45) రాణించగా, బర్న్స్ డకౌట్గా పెవిలియన్ చేరాడు.

అంతకుముందు 171/5 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 326 పరుగుల వద్ద ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీ కాక్(104), బావుమా(74)లు రాణించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 85 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement