మళ్లీ రెండో ర్యాంక్‌కు | Again in the second rank, | Sakshi
Sakshi News home page

మళ్లీ రెండో ర్యాంక్‌కు

Oct 6 2014 1:16 AM | Updated on Sep 2 2017 2:23 PM

మళ్లీ రెండో ర్యాంక్‌కు

మళ్లీ రెండో ర్యాంక్‌కు

బీజింగ్: ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.

షరపోవా ఖాతాలో చైనా ఓపెన్
 
 బీజింగ్: ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో షరపోవా చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఈ రష్యా భామ 6-4, 2-6, 6-3తో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ ఏడాది నాలుగో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న షరపోవా చైనా గడ్డపై తొలిసారి ఓ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పటివరకు షరపోవా 14 దేశాల్లో కనీసం ఒక్క టైటిల్ అయినా గెలిచింది. అమెరికాలో అత్యధికంగా తొమ్మిది నెగ్గగా... జపాన్‌లో నాలుగు, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లలో మూడేసి టైటిల్స్ ఉన్నాయి. విజేతగా నిలిచిన షరపోవాకు 9,35,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 76 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement