ఆ జెర్సీలో డివిలియర్స్‌ను ఆపతరమా.. | AB de Villiers un stopable in pink jersey | Sakshi
Sakshi News home page

ఆ జెర్సీలో డివిలియర్స్‌ను ఆపతరమా..

Feb 10 2018 5:19 PM | Updated on Feb 10 2018 8:37 PM

AB de Villiers un stopable in pink jersey - Sakshi

డివిలియర్స్ (ఫైల్ ఫొటో)

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా గడ్డమీద ఆ జట్టుపై ఎన్నడూ లేని విధంగా టీమిండియా వరుసగా మూడు వన్డేల్లో నెగ్గి ఇటీవల రికార్డు సృష్టించింది. అయితే నాలుగో వన్డేలో నెగ్గి ఆరు వన్డేల సిరీస్‌ను మరో రెండు మిగిలుండగానే కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. కానీ, దక్షిణాఫ్రికా విధ్వసంక ఆటగాడు డివిలియర్స్ రూపంలో భారత్‌కు ఓ అడ్డంగి ఎదురయ్యేలా కనిపిస్తోంది. గాయం కారణంగా నాలుగో వన్డేలోజట్టులోకి వచ్చిన డివిలియర్స్‌కు జొహన్నెస్‌బర్గ్ ఎంతో ప్రత్యేకం. అందులోనూ అతడు పింక్ జెర్సీలో బరిలోకి దిగాడంటే అతడిని ఆపడం ప్రత్యర్ధులకు కష్ట సాధ్యంగా కనిపిస్తోంది. అందుకు గత గణంకాలే నిదర్శణంగా నిలుస్తాయి. 

ఇక్కడ ఓవరాల్‌గా 11 వన్డేలు ఆడిన డివిలియర్స్ సగటు 100.85 కాగా మూడు సెంచరీలు బాదాడు. ఇందులో పింక్ జెర్సీలో కేవలం ఐదు మ్యాచ్‌లాడిన డివిలియర్స్ రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు బాదాడంటే అతడే ఏ స్థాయిలో చెలరేగిపోతాడే చెప్పనక్కర్లేదు. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించిందంటే డివిలియర్స్ ఆడిన కీలక ఇన్నింగ్స్‌లే అందుకు కారణం. పాకిస్తాన్‌పై (128 పరుగులు), వెస్టిండీస్‌పై (149 పరుగులు) శతకాలు నమోదు చేసిన డివిలియర్స్.. భారత్ (77 పరుగులు), శ్రీలంక (60 నాటౌట్) జట్లపై హాఫ్ సెంచరీలు చేశాడు. 2016లో ఇంగ్లండ్ జట్టుపై 36 పరుగులు చేశాడు. నేడు జొహన్నెస్‌బర్గ్‌లో పింక్ జెర్సీలో డివిలియర్స్ ఆడుతుండటంతో అతడు రాణించడంపైనే దక్షిణాఫ్రికా భారీ అంచనాలు పెట్టుకుంది. వరుసగా మూడు వన్డేల్లో ఓడిన సఫారీలు డివిలియర్స్ మరో కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందిస్తాడని జట్టు భావిస్తోంది.

, ,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement