
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల తుదిసమరానికి సిద్దం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా పార్టీ కార్యకర్తలకు, బూత్ క్యాడర్‌కు దిశానిర్ధేశం చేశారు.
‘వైఎస్సార్‌సీపీ బూత్ లెవల్ క్యాడర్ అందరకీ.. మనం నాలుగేళ్లుగా ప్రతి అంశంలో కష్టపడ్డాం. ఈ చివరి యత్నంలో ఉత్తమ ప్రయత్నాల కోసం పోరాడేందుకు ప్రతి ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త సిద్దంగా ఉండాలి. వచ్చే రెండు రోజుల్లో ప్రతి ఓటును తనిఖీ చేయండి. పోలింగ్ రోజు ప్రతి ఒక్కరు ఓటేసేలా చూడాలి. వచ్చే 27 రోజుల్లో మీ నుంచి మద్దతును మరింత కోరుతున్నా’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి రేపటి(శుక్రవారం)తో గడువు ముగుస్తుండటంతో పార్టీ క్యాడర్‌ను వైఎస్ జగన్ అలర్ట్ చేశారు.
To all YSRCP booth level cadre, we’ve worked hard for the past 4yrs, let’s strive for our best efforts in this final stretch. Every vote needs to be verified in the next 2 days & every voter mobilised for voting day. I am counting on your greatest support for the next 27 days!
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 14, 2019