అభివృద్ధి చేసేవారికే పట్టం కట్టండి | YS Bharathi Reddy And Samatha Reddy Election Campaign In Simhadripuram | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేసేవారికే పట్టం కట్టండి

Apr 2 2019 5:55 AM | Updated on Apr 2 2019 5:55 AM

YS Bharathi Reddy And Samatha Reddy Election Campaign In Simhadripuram - Sakshi

సింహాద్రిపురంలో వైఎస్‌ భారతిని ఆప్యాయంగా పలకరిస్తున్న మహిళ

పులివెందుల రూరల్‌/సింహాద్రిపురం: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవారికే రానున్న ఎన్నికల్లో పట్టం కట్టాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి సతీమణి వైఎస్‌ సమతారెడ్డి ప్రజలను కోరారు. సోమవారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో ఇరువురూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప పార్లమెంట్‌ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డిలను ఆశీర్వదించి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళలు వీరికి హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైఎస్సార్‌ ఆశయాల సాధన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని భారతిరెడ్డి, సమతారెడ్డి ఓటర్లకు వివరించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 అబద్ధపు హమీలిచ్చి ప్రజలను మోసం చేశారని, ఆయనకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు రూ.3 వేలు పింఛన్‌ వస్తుందన్నారు. పిల్లల్ని బడికి పంపే తల్లిదండ్రులకు రూ.15 వేలు అందజేస్తారన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ లబ్ధి జరిగేలా నవరత్నాలు ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. వైఎస్‌ భారతిరెడ్డి, వైఎస్‌ సమతారెడ్డిల ప్రచారంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  వైఎస్‌ అవినా‹ష్‌రెడ్డి సోదరి శ్వేత, సీవీ సుబ్బారెడ్డి మనుమరాలు పద్మజ  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement