‘రాహుల్‌ రాజీనామా చేయాల్సిందే’ | Yashwant Sinha Advice About Rahul Gandhi Resignation | Sakshi
Sakshi News home page

లేదంటే జనాల్లో నమ్మకం కోల్పోతారు : యశ్వత్‌ సిన్హా

May 30 2019 5:52 PM | Updated on May 30 2019 5:59 PM

Yashwant Sinha Advice About Rahul Gandhi Resignation - Sakshi

న్యూఢిల్లీ : రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామ చేయకపోతే.. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్‌ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఒక వేళ రాహుల్‌ గాంధీ తన రాజీనామా ఆలోచనకు కట్టుబడకపోతే.. ప్రజల్లో ఆయన పట్ల ఉన్న నమ్మకం తగ్గిపోతుంది. అందుకే కొద్ది కాలం పాటు పార్టీ బాధ్యతలను నిర్మాణాత్మక వ్యవస్థ లేదా ప్రిసిడీయంకు అప్పగించాలి’ అంటూ యశ్వంత్‌ సిన్హా ట్వీట్‌ చేశారు.
 

రాహుల్‌ గాంధీ రాజీనామా అంశం ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే.. కాంగ్రెస్‌ పార్టీ పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడి పట్ల జనాల్లో ఉన్న నమ్మకం సన్నగిల్లుతుందని యశ్వంత్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. (చదవండి : ‘కాంగ్రెస్‌ చీఫ్‌గా దళిత నేత’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement