ప్రతి ఎకరానికీ నీళ్లివ్వాల్సిందే

Y visweshwar Reddy Fires On Payyavula keshav - Sakshi

సంకల్పంతో ప్రభుత్వంలో వణుకు పుట్టించాలి

పయ్యావుల కేశవ్‌ చేతగాని దద్దమ్మ

ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

చంద్రబాబుకు రైతులంటే సరిపోదు : మాజీ ఎంపీ అనంత

అట్టహాసంగా జల సంకల్పయాత్ర ప్రారంభం

అనంతపురం :  ‘చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కారణమైన అనంత జిల్లాను పూర్తిగా విస్మరించారు. నీళ్లివ్వమంటే మోసపూరిత మాటలు చెప్తున్నారు.. మహానేత వైఎస్‌ పట్టుదలతో శ్రీశైలం నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొచ్చాయి.. టీడీపీ వాళ్లు ఒక అడుగు కూడా నీరు ఇవ్వలేకపోయారు  ఉరవకొండ నియోజవర్గానికి నీళ్లు ఎలా ఇవ్వరో చూస్తాం’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆయకట్టుకు హంద్రీ–నీవా నీరివ్వాలనే డిమాండ్‌తో తొమ్మిది రోజులు తలపెట్టిన ‘జల సంకల్పయాత్ర’ గురువారం బెళుగుప్ప మండలం గుండ్లపల్లి నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.

చంద్రబాబు మోసపు మాటలు ఏవిధంగా ఉన్నాయో తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నీరివ్వకుంటే వేలాది మంది రైతులతో పాదయాత్ర చేసి చంద్రబాబు బండారం బయట పెడతాం. వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేస్తాం. 2004లో సీఎం అయిన ఏడాదికే వైఎస్‌ ఉరవకొండకు వచ్చి హంద్రీ–నీవా పథకానికి శంకుస్థాపన చేసి జీడిపల్లి వరకు రూ. 2,300 కోట్లు ఖర్చు చేశారు. రెండోదశ కూడా దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు వచ్చే నాటికి  90 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లలోనే వైఎస్‌ అంత గొప్ప పనులు చేస్తే చంద్రబాబు మాత్రం జీడిపల్లి నుంచి గుండ్లపల్లికి నీరు తీసుకురాలేకపోయారు. రాష్ట్రం విడిపోయిన నాటికి రూ. 90 వేల కోట్లు అప్పులుంటే ఈ మహానుభావుడు వచ్చిన నాలుగేళ్లలోనే  రూ.2.20 లక్షల కోట్లకు అప్పులు పెంచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top