బాబుకు సమాధానం చెప్పేందుకు సిద్ధం | We are ready to answer CM Chandrababu says MP Vijaysai Reddy | Sakshi
Sakshi News home page

బాబుకు సమాధానం చెప్పేందుకు సిద్ధం

Mar 20 2018 2:04 AM | Updated on Aug 14 2018 11:26 AM

We are ready to answer CM Chandrababu says MP Vijaysai Reddy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తాను ప్రధాని మోదీని కలసిన ప్రతిసారి కేసుల గురించి చర్చిస్తున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు.సోమవారం విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రధానిని కలవడంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. వివిధ కేసుల్లో వస్తున్న రిలీఫ్‌ను న్యాయ వ్యవస్థను మ్యానేజ్‌ చేయడం ద్వారా పొందుతున్నారన్న చంద్రబాబుకు దమ్ముంటే ఇదే విషయాన్ని మీడియా ముందుకొచ్చి చెప్పాలని సవాల్‌ విసిరారు.

ఒకవేళ చంద్రబాబు మీడియా ముందుకొచ్చి చెబితే దానికి తగిన సమాధానం చెప్పేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలు తగిన సమయంలో బయటపెడతామన్నారు. సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధమేనని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెబుతుంటే వినకుండా టీడీపీ ఎంపీలు అడ్డుకున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.  వాస్తవానికి సీఎం  చంద్రబాబు మనస్తత్వంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నష్టపోతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుది హిట్లర్‌ మనస్తత్వమని, హిట్లర్‌ వల్ల ఒక దేశం ఏవిధంగా నష్టపోయిందో చూశామన్నారు. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement