
సాక్షి, విజయనగరం : నారా లోకేష్ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్సీకి తక్కువగా వ్యవహరిస్తున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు. లోకేష్ స్పీకర్‌కి బహిరంగ లేఖ రాయటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. గతంలో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న ఘనత చంద్రబాబు ప్రభుత్వంపై ఉందని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోలేని స్థితిలో స్పీకర్ ఉండేవారని గుర్తుచేశారు. స్పీకర్ పదవిని దిగజార్చిన చరిత్ర ఉన్న టీడీపీ తరపున దెయ్యాలే వేదాలు వల్లించినట్లుగా నారా లోకేష్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. విలువలతో కూడిన రాజకీయం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. టీడీపీని కనుమరుగు చేయడానికి వైఎస్ జగన్‌కు ఒక్క నిమిషం కూడా పట్టదని, ఆయన తలుచుకుంటే లోకేష్‌తో సహా అందరూ వైసీపీలోకి వస్తారని తెలిపారు.