టీడీపీకి 14.. మహాకూటమి సీట్ల పంపకాలివే..!

Uttam Kumar Reddy Meet Rahul Gandhi Over Mahakutami Seat Sharing - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశారు. ఆయనతోపాటు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా కూడా ఉన్నారు. మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశాన్ని వారు రాహుల్‌కు వివరించారు. కాగా, ఈ సమావేశంలో మహాకూటమి పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. మహాకూటమిలోని పార్టీలకు సీట్ల కేటాయింపులో భాగంగా.. టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 4 స్థానాలు కేటాయించినట్టుగా తెలుస్తోంది.  మహాకూటమికి సంబంధించి తొలి జాబితాను రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

మరోవైపు గురువారం ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది. సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఆమోదంతో.. తొలి జాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top