రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఓట్లు అడగను అనగలరా..?

uttam kumar reddy about muslim reservations - Sakshi

ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌కు ఉత్తమ్‌ సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయకుంటే ఓట్లు అడగను అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పగలరా అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సవాల్‌ చేశారు. ముస్లింలకు 4 నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ఓట్లు పొందిన కేసీఆర్‌.. 44 నెలలవుతున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నా రని దుయ్యబట్టారు.

దూరదర్శన్‌ రిటైర్డ్‌ జేడీ షుజత్‌ అలీ నేతృత్వంలో వివిధ వర్గాల విద్యావంతులు, మేధావులు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ పాలన పై అన్ని వర్గాల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, ఈ చేరికలే దీనికి నిదర్శనమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేకపాలన కొనసాగిస్తున్నాయని.. మత సామరస్యం దెబ్బతీసేలా బీజేపీ, ముస్లింలకు రిజర్వేషన్లు అంటూ టీఆర్‌ఎస్‌ మోసం చేస్తున్నాయని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top