‘గురివిందకు ప్రతిరూపం చంద్రబాబు’ | Sajjala Ramakrishna Reddy Slams On Chandrababu | Sakshi
Sakshi News home page

‘గురివిందకు ప్రతిరూపం చంద్రబాబు’

May 25 2020 10:06 PM | Updated on May 25 2020 10:25 PM

Sajjala Ramakrishna Reddy Slams On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. కరోనాకు భయపడి హైదరాబాద్‌లో గడిపిన చంద్రబాబును రాష్ట్రంలోకి రాకుండా ఎవరు అడ్డుకున్నారని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ‘ఈ 65 రోజుల్లో హైదరాబాద్‌లో కూర్చోకుండా రాష్ట్రానికి వస్తానంటే చంద్రబాబును ఎవరైనా వద్దన్నారా? విశాఖకు విమానాలు రద్దయితే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటి. రోడ్డు మార్గంలో సోమవారం ఉండవల్లి వచ్చినట్టు విశాఖపట్నం వెళ్తానంటే ఎవరు అడ్డు చెప్పారు. చంద్రబాబు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే జనం నవ్వుకోరా?  ప్రజలకు కష్ట కాలంలో నిత్యావసర సరుకులు అందించిన ఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు కోర్టులో కేసులు వేయించారు. ఈ రోజు హైదరాబాద్‌ నుంచి వచ్చేటప్పడు చంద్రబాబు దారిలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారు. గురివిందకు ప్రతిరూపం చంద్రబాబు’ అని సజ్జల ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement