కేసీఆర్‌తో ముగిసిన సబితా భేటీ | Sabitha Indra Reddy Meets KCR In Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తో ముగిసిన సబితా భేటీ

Mar 13 2019 7:28 PM | Updated on Mar 16 2019 10:30 AM

Sabitha Indra Reddy Meets KCR In Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌ రెడ్డి బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది.

ఈ సమావేశం అనంతరం కార్తీక్‌ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. టీఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతామని అన్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరతామని వెల్లడించారు. కేసీఆర్‌ను కలిశాక పార్టీ మార్పుపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపించిందని పేర్కొన్నారు. కాగా, కార్తీక్‌ రెడ్డికి చేవెళ్ల పార్లమెంట్‌ టికెట్‌ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్టుగా సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement