కమల దళంలోకి రజనీ?

Rajinikanth to merge his party with BJP? - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ సినీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయం కాషాయరంగు పులుముకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో రజనీ పలుమార్లు సమావేశమై ఈ అంశంపై చర్చించారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. రజనీ ఇప్పటికే గడ్కారీ తదితర కేంద్రమంత్రులతో, ముఖ్యనేతలతో సమావేశమైనట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు డాక్టర్‌ తమిళిసై పదవీకాలం త్వరలో ముగియనుంది.  త్వరలో రజనీకాంత్‌ను పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షునిగా చేయడం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుపొందాలని బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top