‘ఫతేపూర్‌’ బస్తీలో రాజ్‌బబ్బర్‌

Raj Babbar's fight isn't just for Fatehpur Sikri, but for his political career - Sakshi

ఫతేపూర్‌ సిక్రీలో త్రిముఖ పోటీ

బీజేపీ, బీఎస్‌పీకి గట్టి పోటీనిస్తోన్న కాంగ్రెస్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆరెల్డీ)తో కూడిన మహాగఠ్‌ బంధన్‌లో స్థానం దక్కని కాంగ్రెస్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో గెలుపు అవకాశాలున్న అతి కొద్ది సీట్లలో ఫతేపూర్‌ సిక్రీ ఒకటి. యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ బాలీవుడ్‌ నటుడైన రాజ్‌బబ్బర్‌ రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2009లో మొదటిసారి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయ చేతిలో దాదాపు పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అదే ఏడాది జరిగిన ఫిరోజాబాద్‌ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ను బబ్బర్‌ ఓడించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఘజియాబాద్‌లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి ప్రస్తుత కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఆయన ఎస్పీలో ఉండగా ఆ పార్టీ తరఫున ఆగ్రా నుంచి 1999, 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. పునర్విభజనలో ఆగ్రా స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. ఆగ్రా జిల్లాలో సగ భాగం ఫతేపూర్‌ సిక్రీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.

ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఫతేపూర్‌ సిక్రీ నియోజకవర్గం 2009లో ఏర్పాటయింది. 2014లో బీజేపీ అభ్యర్థి చౌధరీ బాబూలాల్‌ తన సమీప బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయను లక్షా 73 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. అప్పుడు కాంగ్రెస్‌–ఆర్‌ఎల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన అమర్‌సింగ్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఈసారి బాబూలాల్‌కు బీజేపీ టికెట్‌ దక్కలేదు. రాజ్‌కుమార్‌ చాహర్‌ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. మహాగఠ్‌ బంధన్‌ తరఫున శ్రీభగవాన్‌ శర్మ అలియాస్‌ గుడ్డూ పండిత్‌ (బీఎస్పీ) పోటీ చేస్తున్నారు. ఆగ్రా నగరంలో పుట్టిన బబ్బర్‌ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.

ఘజియాబాద్‌ వద్దన్న బబ్బర్‌..
రాజ్‌ బబ్బర్‌ను మొదట ఆయన కిందటిసారి ఓడిన ఘజియాబాద్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది. బబ్బర్‌ మద్దతుదారులతో పాటు ఆయన కూడా అక్కడి నుంచి పోటీకి ఇష్టపడకపోవడంతో చివరికి ఫతేపూర్‌ సిక్రీ టికెట్‌ కేటాయించారు. ఎన్నికల్లో కులం కూడా ప్రధాన పాత్ర పోషించే ఈ నియోజకవర్గంలో రాజ్‌బబ్బర్‌ కులానికి (విశ్వకర్మ) చెందిన జనం బాగా తక్కువ. తనను చూసి అభిమానంతో చేతులు ఊపుతున్న ప్రజలంతా తన కులస్తులేనని, బంధువులని బబ్బర్‌ ఓ సందర్భంలో చమత్కరించారు. బాలీవుడ్‌ నటునిగా జనంతో ఉన్న పాత సంబంధం, స్థానికునిగా ఉన్న గుర్తింపు తనకు చాలని ఆయన భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఠాకూర్లు, బ్రాహ్మణుల తర్వాత జాట్ల జనాభా ఎక్కువ. బీజేపీ అభ్యర్థి చాహర్‌ జాట్‌. బీఎస్పీ నేత గుడ్డూ పండిత్‌ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. జనాభా రీత్యా ఠాకూర్ల ఆధిపత్యం ఉన్నా ఈ వర్గం అభ్యర్థులెవరూ బరిలో లేరు. బీఎస్పీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సూరజ్‌పాల్‌ సింగ్, ధరమ్‌పాల్‌ సింగ్‌ (ఇద్దరూ ఠాకూర్లే) ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో రాజ్‌ బబ్బర్‌ ప్రచారం ఊపందుకుంది.

మోదీ ఇమేజ్‌పైనే బీజేపీ అభ్యర్థి భారం
బీజేపీకి లోక్‌సభ అభ్యర్థిని చూసి తాము ఓట్లేయడం లేదనీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రగతిశీల విధానాల కారణంగానే కాషాయ పక్షాన్ని గెలిపిస్తున్నామనే అభిప్రాయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి చాహర్‌ గతంలో సిక్రీ నుంచి అసెంబ్లీకి మూడుసార్లు పోటీచేసి ఓడిపోయారు. బబ్బర్‌ అనుచరునిగా పనిచేసిన నేపథ్యం కూడా చాహర్‌కు ఉంది. అయినా, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నరేంద్రమోదీ ముఖం చూసి ఓటేసే వారి సంఖ్య యూపీలో గణనీయంగా ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

బీఎస్పీకి దూరమైన బ్రాహ్మణ ఓటర్లు?
బ్రాహ్మణ వర్గంలో మంచి పలుకుబడి ఉన్న సీమా ఉపాధ్యాయకు బీఎస్పీ టికెట్‌ ఇవ్వలేదు. ఆమె పార్టీ టికెట్‌పై 2009 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈసారి ఆమె వర్గానికే చెందిన గుడ్డూ పండిత్‌కు బీఎస్పీ టికెట్‌ లభించింది. స్థానికేతురుడైన బులంద్‌శహర్‌ ఎమ్మెల్యే పండిత్‌కు మద్దతు ఇవ్వడానికి బ్రాహ్మణులు ఆసక్తి చూపడం లేదు. మాయావతి కులమైన జాటవులు మాత్రమే బీఎస్పీ అభ్యర్థి తరఫున ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మంచి పేరు లేకపోవడం బబ్బర్‌కు అనుకూలాంశంగా మారింది. ఎస్పీకి చెందిన కొందరు బ్రాహ్మణ నేతలు బబ్బర్‌ తరఫున ప్రచారం చేయడంతో పోటీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చాహర్, బబ్బర్‌ మధ్యనే ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు

16-05-2019
May 16, 2019, 22:21 IST
సాక్షి, చిత్తూరు : చంద్రగిరిలో టీడీపీ నేతల దాదాగిరి కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలోని రీపోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో దళితులపై టీడీపీ నేతలు...
16-05-2019
May 16, 2019, 20:49 IST
కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు.
16-05-2019
May 16, 2019, 20:43 IST
కోల్‌కతా : బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆ రాష్ట్ర సీఎం...
16-05-2019
May 16, 2019, 20:42 IST
సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఓటమికి భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర...
16-05-2019
May 16, 2019, 20:34 IST
గాడ్సే వ్యాఖ్యలపై సాధ్వి క్షమాపణ
16-05-2019
May 16, 2019, 19:11 IST
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల...
16-05-2019
May 16, 2019, 18:56 IST
దీదీయే ‘కీ’లకం
16-05-2019
May 16, 2019, 18:24 IST
చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి కల్పించాలని ఈసీని చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కోరారు.
16-05-2019
May 16, 2019, 17:43 IST
‘గాంధీ సిద్ధాంతానికి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ తూట్లు’
16-05-2019
May 16, 2019, 17:19 IST
దేశద్రోహ చట్టాన్ని బలోపేతం చేస్తాం : రాజ్‌నాథ్‌ సింగ్‌
16-05-2019
May 16, 2019, 16:44 IST
అందుకే ఆమె మాపై చీటకి మాటికి చిర్రుబుర్రులాడుతున్నారు.
16-05-2019
May 16, 2019, 16:28 IST
ప్రభుత్వ ఏర్పాటులో రాహుల్‌ పాత్ర కీలకం..
16-05-2019
May 16, 2019, 15:53 IST
సాక్షి, జనగాం: రాష్ట్రంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం రాజకీయ నేతలు, పోలీసులు బ్యాలెట్‌ బాక్స్‌ల మీద దృష్టి పెట్టారు. జిల్లాలో బాలెట్‌బాక్స్‌లను...
16-05-2019
May 16, 2019, 15:34 IST
గాడ్సేపై ప్రజ్ఞా సింగ్‌ సంచలన వ్యాఖ్యలు
16-05-2019
May 16, 2019, 15:00 IST
‘అమిత్‌ షా గూండా..మోదీ సిగ్గుమాలిన ప్రధాని’
16-05-2019
May 16, 2019, 14:32 IST
తొలి ఓటు నుంచి చివరి ఓటు లెక్కింపు వరకు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు ...
16-05-2019
May 16, 2019, 14:13 IST
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ‍్న తెలిపారు.
16-05-2019
May 16, 2019, 13:22 IST
సాక్షి, న్యూఢిల్లీ : బెంగాలీ విద్యావేత్త ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...
16-05-2019
May 16, 2019, 13:01 IST
పట్నా : దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని తెర మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. మోదీని...
16-05-2019
May 16, 2019, 12:36 IST
కోల్‌కతా : తనకు మద్దతుగా నిలిచిన  కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ, టీడీపీ అధినేతలకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top