పౌరసత్వ వివాదం: నిరసనకు దిగిన ప్రియాంక

Priyanka Gandhi Protest At India Gate Over CAA - Sakshi

విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం

సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిరసన చేపట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసుల చర్యలను తప్పుపడుతూ ఆమె నిరసన వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై దాడిని ఆమె ఖండించారు. ఈ సందర్భంగా ఆందోళనకారుల నిరసనలకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టడంతో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా విద్యార్థులు ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ సహా, పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top