త్వరలో చొక్కాలు పట్టి నిలదీస్తారు

Pawan kalyan comments on Polavaram expats issue - Sakshi

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

పోలవరం రూరల్‌/ బుట్టాయగూడెం: ప్రభుత్వ పెద్దలను ప్రజలు చొక్కాలు పట్టుకొని నిలదీసే రోజులు దగ్గర లోనే ఉన్నాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. పశ్చిమగోదావరి జల్లా పోలవరం నిర్వాసిత గ్రామం మాదాపురంలో మంగళవారం నిర్వాసితుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ళు కూల్చివేసి రోడ్డుపై నిలబెడితే అప్పుడు పోలవరం నిర్వాసితుల బాధేంటో వారికి తెలుస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 7 ముంపు మండలాల నిర్వాసితుల పరిహారం చెల్లింపుల పరిశీలనకు టాస్క్‌ఫోర్స్‌ వేయాలని అన్నారు. జాతి ప్రయోజనాల కోసం ఉన్న ఊర్లనే త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రజలందరికీ ఉందన్నారు.

వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ డబ్బులతో ప్రత్యేకంగా బస్సులు వేసి మరీ ప్రాజెక్టును చూపించడానికి జనాలను తరలిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారూ మీ హెరిటేజ్‌ని జాతికి అంకితం చేయండి, అప్పుడైనా మీకు నిర్వాసితుల బాధలు తెలుస్తాయన్నారు. పోలవరం నిర్వాసితులను కూడా బస్సుల్లో అమరావతి తీసుకువచ్చి మీరు కట్టిన రాజధానిని చూపిస్తామన్నారు. అలాగే అమరావతి వేదికగా నిర్వాసితుల కష్టాలను అందరికీ వినిపిస్తామని చెప్పారు. పోలవరం నిర్వాసితుల్లో టీడీపీ అనుకూలురకు పరిహారం ఇచ్చి ఇతరులకు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. ఒకవైపు నిర్వాసితులు నానా పాట్లు పడుతుంటే అక్కడి నాయకులు లక్షల కోట్ల అవినీతిలో జోగుతున్నారని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top