నటులంతా ఒకటవుదాం.. జగన్‌ను సీఎం చేద్దాం

MVV Satyanarayana Election Campaign in Visakhapatnam - Sakshi

విశాఖ సినీకళాకారుల ఆత్మీయ సదస్సులో కళాకారుల పిలుపు

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): సినీ కళాకారులంతా ఒక్కటవుదాం..జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్‌ పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ ఇక్కడకు రావాలన్నా..కళాకారుల జీవితాలు బాగుండాలన్నా అది జగన్‌మోహన్‌రెడ్డితోనే ముడిపడి ఉందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంవీవీ సత్యనారాయణ, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్‌ను గెలిపిం చాలంటూ..విశాఖ సినీకళాకారుల ఆత్మీయ సదస్సు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. సినీ నటుడు పృథ్వీ మాట్లాడుతూ వైఎస్సార్‌ అంటే ప్రాణమని..జగన్‌ అంటే పంచ ప్రాణాలని తెలిపారు. 2014 ఎన్నికల్లో ఓ పక్క పవన్‌..మరో పక్క మోదీని పట్టుకుని లేనిపోని వాగ్ధానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం యువభేరీలు, ఆమరణదీక్షలు చేసిన మహోన్నత వ్యక్తి జగన్‌ అని చెప్పారు.

ప్రత్యేక హోదా అనేవారిని అరెస్టులు చేయ్యాలన్న చంద్రబాబుకు..ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం తెలిసినట్టుందన్నారు. సింహాచలం స్వామి సాక్షిగా సినీ కళాకారులకు ఇచ్చిన హామీ అమలు కాకపోతే తనను నిలబెట్టాలని తెలిపారు. పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి ఎంవీ వీ సత్యనారాయణ మాట్లాడుతూ  రాష్ట్ర విభజన జరిగినా సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉండిపోయిందని, అక్కడి నుంచి విశాఖకు తరలించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సినీ పరిశ్రమ ఇక్కడకు తరలిం చేందుకు కృషి చేస్తామని చెప్పారు. పరిశ్రమ ఇక్కడకు వస్తే సినీ కళాకారులకు 365 రోజుల పని దొరుకుతుందని, గుర్తింపు కార్డు ఉన్న కళా కారులందరికీ ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇస్తామని హామీ నిచ్చారు. అంతేగాక స్టూడియోలు ఏ ర్పాటు చేసేందుకు ముం దుకు వచ్చే వారికి స్థలాలు, కళాకారులకు ఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. సినీ కార్మికుడిగా తనను(ఎంవీవీ సత్యనారాయణ), దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి ద్రో ణంరాజు శ్రీనివాస్‌ను గెలిపిం చాలని కోరారు.

జగన్‌ను సీఎం చేయడానికి ప్రజలు సిద్ధం
ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయానికి వచ్చేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర పూర్తయిన వెంటనే ఇంటిలిజెన్స్‌ నివేదికల్లో టీడీపీ ఓడిపోతుందని రావడంతో..అప్పటికప్పుడే పసుపు కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలను మభ్యపెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు అవకాశమిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంటక్‌ మాట్లాడుతూ నటులందరిదీ ఒకటే కుటుం బం అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు చాలా చేయాల్సి ఉందని, జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుని మన సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు కృష్ణుడు, జోగినాయుడు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top