
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఆయన తల్లి స్వర్ణమ్మ శనివారం కలిశారు. తోటి ఎంపీలతో కలిసి దీక్షలో మిథున్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం మిథున్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం గర్వంగా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయ నేతలకు పదవులు, డబ్బు ఆశ ఉండకూడదని, రాష్ట్రం కోసం మరింత పోరాటం చేయాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు.