చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కల్యాణ్‌కు లేదు | dutta ramchandra rao fires on pawan kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కల్యాణ్‌కు లేదు

Feb 22 2018 9:42 AM | Updated on Mar 22 2019 5:33 PM

dutta ramchandra rao fires on pawan kalyan - Sakshi

మాట్లాడుతున్న డాక్టర్‌ దుట్టా, పక్కన జ్ఞానమణి

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహాన్‌రెడ్డిని విమర్శించే స్థాయి లేదని, అలాగే సీఎం చంద్రబాబును ప్రశ్నించే దమ్ము కూడా లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు పేర్కొన్నారు. హనుమాన్‌జంక్షన్‌లో బుధవారం డాక్టర్‌ దుట్టా విలేకరులతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్, చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని మరోమారు పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కలిసి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష నేత నిత్యం ప్రజల్లో అవగాహన పెంచు తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుండటంతో మళ్లీ ప్రత్యేక ప్యాకేజీ కాదు హోదానే కావాలనే పల్లవిని చంద్రబాబు అండ్‌ కో అందుకుందని ఎద్దేవా చేశారు.

పవన్‌కల్యాణ్‌ జేఎఫ్‌సీ ఎందుకు ఏర్పాటైందో అర్ధం కావటం లేదన్నారు. పవన్‌కల్యాణ్‌ పూర్తిగా రాజకీయ అజ్ఞాని అని, చంద్రబాబు చేతిలో పూర్తిగా కీలుబొమ్మగా మారారని విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్‌కు ఆ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నించటం కోసం పుట్టిన జనసేన పార్టీ నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఆగడాలపై ప్రశ్నించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్ధంకావటం లేదన్నారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీ సభ్యుడు కొనకళ్ల వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శులు నక్కా గాంధి, దయాల విజయనాయుడు, జిల్లా అధికారప్రతినిధి వేగిరెడ్డి సూర్యనారా యణ, నాయకులు దుట్టా శివనారాయణ, అల్లంశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement