10 సీట్లు డిమాండ్‌ చేసిన దేవెగౌడ | Deve Gowda demands 10 seats out of 28 in Karnataka | Sakshi
Sakshi News home page

10 లోక్‌సభ సీట్లు కోరిన జేడీఎస్‌

Mar 6 2019 2:25 PM | Updated on Mar 18 2019 9:02 PM

Deve Gowda demands 10 seats out of 28 in Karnataka - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా జేడీఎస్‌ 10 సీట్లు డిమాండ్‌ చేసింది. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై కాంగ్రెస్​-జేడీఎస్‌ మధ్య బుధవారం చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో భేటీ అయ‍్యారు. ఈ సందర్బంగా ఇరు పార్టీల నేతలు సీట్ల పంపకాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం దేవెగౌడ మాట్లాడుతూ.. తాము పది సీట్లు అడిగామని, రాహుల్‌తో చర్చల అనంతరం తుది నిర్ణయం వెలువడుతుందన్నారు. తమకు 12 స్థానాల్లో గెలిచి సత్తా ఉందని, అయితే పొత్తుల్లో భాగంగా పది సీట్లు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. దీంతో జేడీఎస్‌ పది స్థానాలు తమకు కేటాయించాలని కోరింది. ఈ సమావేశానికి జేడీఎస్‌కు చెందిన దినేష్ అలి, కాంగ్రెస్‌కు చెందిన కేసీ వేణుగోపాల్‌ కూడా హాజరయ్యారు.

కాగా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. సీట్ల కేటాయింపుకు సంబంధించి తమకు 10 సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు రెండు పార్టీల కార్యకర్తల మధ్య సయోధ్య లేకపోవడంతో ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. దీంతో ఇరు పార్టీల నేతలు ....పార్టీ శ్రేణులు విభేదాలు మరిచి పని చేయాలని సూచిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement