సీఎం యోగిపై కాంగ్రెస్‌ ట్వీట్‌.. వైరల్‌ | Congress Tweet On Yogi Adityanath Browsing History | Sakshi
Sakshi News home page

సీఎం యోగిపై కాంగ్రెస్‌ ట్వీట్‌.. వైరల్‌

Apr 10 2018 7:29 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Tweet On Yogi Adityanath Browsing History - Sakshi

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న యోగి ఆదిత్యనాథ్‌ గ్రాఫిక్స్‌ చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆన్‌లైన్‌లో దేని కోసం సెర్చ్‌ చేస్తారో చూడండి అంటూ కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ పేజీలో ఓ వీడియో పెట్టింది. అది ఇప్పుడు వైరల్‌ అవుతుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నో సార్లు బహిరంగ సభల్లో వివాదస్పద వ్యాఖ్యాలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో యోగి చేసిన ఇలాంటి వివాదస్పద ప్రసంగాలనే అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలను సంధించింది. ద్వేషపూరిత ప్రసంగాలను, రెచ్చగొట్టే ప్రసంగాలు ఎలా చేయాలి అనే అంశాన్ని ఆయన ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తారని ఆ వీడియో సారాంశం.

ఈ ట్వీట్‌పై కాంగ్రెస్‌ మద్దతు దారులు, యోగి మద్దతు దారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎదుర్కొడానికి కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాను బాగా వాడుతున్నట్టు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు తమ భావాలను నిర్భయంగా వ్యక్తపర్చడానికి వేదికైన సామాజిక మాధ్యమాలను ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించి ముప్పుతిప్పలు పట్టేడానికి వేదిక వాడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement