‘చంద్రబాబుకు పాలించే అర్హత లేదు’ | Chandrababu Naidu Looted AP Says YSRCP Leader Lakshmi Parvathi | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు పాలించే అర్హత లేదు’

Jun 13 2018 6:47 PM | Updated on Aug 20 2018 6:07 PM

Chandrababu Naidu Looted AP Says YSRCP Leader Lakshmi Parvathi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ను పాలించే అర్హత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు 4 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు రైతులు సహా అందరినీ మోసం చేశారని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు.

సొంత జెండా లేని చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీని అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల్లో పేర్కొన్న 600 హామీల్లో ఒక్క హామీని కూడా చంద్రబాబు పూర్తిగా నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. చంద్రబాబు నిజంగా నిజాయితీపరుడైతే ఆయనపై ఉన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement