రేపిస్టులకు అదే సరైన శిక్ష | BJP MP Sharma Comments on Rapists | Sakshi
Sakshi News home page

Mar 29 2018 11:10 AM | Updated on Mar 29 2019 8:30 PM

BJP MP Sharma Comments on Rapists - Sakshi

ఎంపీ శర్మ (ఫైల్‌ ఫోటో)

గువాహటి : దేశంలో మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న అఘాయిత్యాలపై బీజేపీ నేత చేసిన కామెంట్లు రాజకీయ దుమారాన్ని రేపాయి. ‘రేపిస్టులను కాల్చి చంపటమే సరైన శిక్ష’ ఆయన వ్యాఖ్యానించారు.

అస్సాంలోని తేజ్‌పూర్‌ నియోజకవర్గ పార్లమెంట్‌ సభ్యుడు ఆర్‌పీ శర్మ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ‘అత్యాచారాలు చేసే వారిని కేసు దర్యాప్తు, కోర్టు విచారణ.. శిక్షల పేరుతో కాలయాపన చేయటం మంచిది కాదు. పోలీసులు వారిని ప్రజల సమక్షంలో కాల్చి పడేయటమే మంచిది. మహిళలతో అగౌరవంగా ప్రవర్తించేవారికి అదే సరైన శిక్ష. అప్పుడు ఇలాంటి నేరాలు తగ్గుతాయి’ అని శర్మ పేర్కొన్నారు.

అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చట్టంపై కనీస గౌరవం లేకుండా ఆయన మాట్లాడారని.. తక్షణమే శర్మ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా అస్సాంలో ఐదేళ్ల బాలికపై ఐదుగురు కిరాతకులు గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడి.. తగలబెట్టారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించే క్రమంలోనే శర్మ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement