‘పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిపోతున్నా’ | BJD MP Jay Panda Resigns From Party | Sakshi
Sakshi News home page

‘పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిపోతున్నా’

May 28 2018 6:42 PM | Updated on May 28 2018 7:06 PM

BJD MP Jay Panda Resigns From Party - Sakshi

జే పాండా (ఫైల్‌ ఫోటో)

భువనేశ్వర్‌: పార్టీనుంచి శాశ్వతంగా తొలగిపోతున్నట్లు బీజ్‌ జనతాదళ్‌ ఎంపీ జే పాండా ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు బావోద్వేగంతో లేఖ రాశారు. సీఎంతో విభేదాల కారణంగా పాండాను జనవరిలోనే పార్టీ నుంచి డిస్‌మిస్‌ చేస్తున్నట్లు బీజేడీ ప్రకటించింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న పాండా సోమవారం పార్టీ నుంచి శాస్వతంగా తొలగిపోతున్నట్లు నవీన్‌ పట్నాయక్‌కు లేఖ ద్వారా తెలియజేశారు.

తనకు ఇష్టం లేకున్నా బరువైన హృదయంతో్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారే ముఖ్యమైన స్థానంలో ఉన్నారని, వారి నుంచి పార్టీని కాపాడాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీతో సంబందాలు ఉన్నాయన్న కారణంతో పాండాను  పార్టీని నుంచి బహిష్కరించామని బీజేడీ పేర్కొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా పాండా బీజేపీ మద్దతు తెలిపారని, కనీసం తన నియోజకవర్గంలో కూడా పార్టీ తరుఫున ప్రచారం చేయలేదని బీజేడీ విమర్శిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement