టెంపాలో నాట్స్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్

NATS community event held by Florida chapter - Sakshi

ఫ్లోరిడా: టెంపాలోని హెటీఎఫ్‌ ఆడిటోరియంలో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఏర్పాటు చేసింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అట్లాంటా, ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ టెంపా బే, నాట్స్ టెంపా బే విభాగాలు సంయుక్తంగా ఈ సర్వీసెస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాయి. దాదాపు 350 మందికి పైగా ఇక్కడ సేవలను వినియోగించుకున్నారు. వీసా రెన్యూవల్స్ కు సంబంధించి 100మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికెట్, లీగల్ డాక్యుమెంట్లకు సంబంధించి 50 మందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు.

ఇమ్మిగ్రేషన్ సేవలకు సంబంధించి ఇంత మంచి కార్యక్రమాన్ని నాట్స్ చేపట్టినట్టుందుకు స్థానిక తెలుగువారితో పాటు భారతీయులు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. టెంపా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త రాజేశ్ కాండ్రు నేతృత్వంలో ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాట్స్ వాలంటీర్లు దీని కోసం ప్రచారం చేయడంతో పాటు ఈ సేవా కేంద్రంలో తమ విలువైన సేవలు అందించారు. టెంపాలో తెలుగువారి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నాట్స్ తెలిపింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top