ఆటోలో మహిళపై గ్యాంగ్ రేప్.. కూతురి హత్య | woman gangraped in auto, 9 months daughter killed | Sakshi
Sakshi News home page

ఆటోలో మహిళపై గ్యాంగ్ రేప్.. కూతురి హత్య

Jun 6 2017 10:09 AM | Updated on Sep 27 2018 2:34 PM

ఆటోలో మహిళపై గ్యాంగ్ రేప్.. కూతురి హత్య - Sakshi

ఆటోలో మహిళపై గ్యాంగ్ రేప్.. కూతురి హత్య

భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్తున్న మహిళపై ముగ్గురు దుండగులు ఆటోలో అత్యాచారం చేయడమే కాక, 9 నెలల వయసున్న ఆమె కూతురిని ఆటోలోంచి రోడ్డుమీదకు విసిరేయడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

హరియాణాలోని గుర్‌గావ్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్తున్న మహిళపై ముగ్గురు దుండగులు ఆటోలో అత్యాచారం చేయడమే కాక, 9 నెలల వయసున్న ఆమె కూతురిని ఆటోలోంచి రోడ్డుమీదకు విసిరేయడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మే 29వ తేదీ రాత్రి తన భర్తతో గొడవపడి అర్ధరాత్రి సమయంలో తాను ఖాండ్సా గ్రామంలోని తన పుట్టింటికి బయల్దేరానని, అప్పటికే ముగ్గురు కూర్చుని ఉన్న ఆటోలో ఎక్కానని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

ఆటోలో ఎక్కినప్పటి నుంచి వాళ్లు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఆమె వాళ్లను ఎదిరించడం, చిన్నారి ఏడవడంతో వాళ్లు ఆ చిన్నారిని ఆటోలోంచి రోడ్డుమీదకు విసిరేశారు. ఆ తర్వాత ఆటోలోనే మహిళపై అత్యాచారం చేశారు. కాగా, తొలుత తన కూతురిని రోడ్డుమీదకు విసిరేశారని చెప్పిన బాధితురాలు... ఆ తర్వాత ఆ మగ్గురూ చిన్నారి మీద కూడా అత్యాచారం చేసినట్లు చెప్పింది. నిందితులపై హత్య, అత్యాచారం కేసులు నమోదు చేశామని, కానీ బాధితురాలు వైద్యపరీక్షలకు నిరాకరిస్తోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement