తప్పిపోయిన పిల్లల కోసం వెబ్‌సైట్ | Website for missing children | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన పిల్లల కోసం వెబ్‌సైట్

Jun 3 2015 1:06 AM | Updated on Sep 3 2017 3:07 AM

తప్పిపోయిన పిల్లల కోసం వెబ్‌సైట్

తప్పిపోయిన పిల్లల కోసం వెబ్‌సైట్

దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లల కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంగళవారం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లల కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంగళవారం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్, శిశుసంక్షేమ మంత్రి మేనకాగాంధీ సంయుక్తంగా ‘‘ఖోయా-పాయా’’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పౌరులు తమకు ఎవరైనా తప్పిపోయిన పిల్లలు కనిపించినా, అనుమానాస్పద వ్యక్తులతో పిల్లలు కనిపించినా ఈ వెబ్‌సైట్ ద్వారా తెలపొచ్చు.

ట్రాక్ చైల్డ్ పేరుతో ఇప్పటికే వెబ్‌సైట్ ఉన్నా అది పోలీసులకు ఉద్దేశించిందని, ఈ కొత్త వెబ్‌సైట్‌లో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు కావచ్చని.. సమాచారాన్ని అప్‌లోడ్ చేయవచ్చని మేనకాగాంధీ తెలిపారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం ఏడాదికి సగటున 70 వేల మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement