అతను చేసిన పనికి పోలీసులను పిలవాలనుకున్నా.. 

Vishal Dadlani Reacts To Man Forcibly Kissing Neha Kakkar On Indian Idol - Sakshi

న్యూఢిల్లీ : సోనీలో ప్రసారమవుతున్న ఇండియన్‌ ఐడల్‌ 11 షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న నేహాకక్కర్‌ను కంటెస్టెంట్‌ ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే షోలో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న విశాల్‌ దడ్లాని తాజా ఎపిసోడ్‌పై ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. 'కంటెస్టెంట్‌ చేసిన పనికి పోలీసులను పిలుద్దామని నేహాకక్కర్‌కు చెప్పాను. కానీ ఆమె ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపోవాలంటూ తనను వారించిందని' పేర్కొన్నాడు.

అయితే కంటెస్టెంట్‌ చేసిన పనిని నెటిజన్లు తీవ్రంగా తప్పు పడుతూ విశాల్‌ దడ్లానికి వరుస ట్వీట్‌లు చేశారు. 'విశాల్‌ జీ ! మీరు కంటెస్టెంట్‌ చేసిన పనికి అతని చెంపను పగలగొట్టాల్సింది. ఆ పని చేసేందుకు అతనికి ఎంత దైర్యం, అతన్ని ఊరికే వదిలేయద్దు అంటూ' ట్వీట్‌ చేశాడు. 'నిజంగా కంటెస్టెంట్‌ తన హద్దు మీరి ప్రవర్తించాడని, ఇటువంటి చర్యలు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని' మరొకరు ట్వీట్‌ చేశారు. 'కేవలం టీఆర్‌పీ రేటింగ్‌ కోసమే షో నిర్వాహకులు కావాలనే కంటెస్టెంట్‌తో ఆ పని చేయించారని, ముందు షో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే బాగుండేదని' పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. వీటిపై విశాల్‌ దడ్లాని స్పందిస్తూ.. కంటెస్టెంట్‌ చేసిన పనికి పోలీసులను పిలవాలని చెప్పానని, నేహాకక్కర్ అందుకు ఒప్పుకోలేదని పేర్కొన్నారు. కానీ అతనికి మానసిక చికిత్స అవసరం ఎంతో ఉందని తెలిపాడు. మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలని షో నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు.  
చదవండి : (వైరల్‌ : జడ్జిని ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top