నేడు మావో ప్రభావిత రాష్ట్రాలతో రాజ్‌నాథ్‌ సమీక్ష | Today Rajnath review in Mao affected states | Sakshi
Sakshi News home page

నేడు మావో ప్రభావిత రాష్ట్రాలతో రాజ్‌నాథ్‌ సమీక్ష

May 8 2017 12:40 AM | Updated on Aug 11 2018 9:02 PM

నేడు మావో ప్రభావిత రాష్ట్రాలతో రాజ్‌నాథ్‌ సమీక్ష - Sakshi

నేడు మావో ప్రభావిత రాష్ట్రాలతో రాజ్‌నాథ్‌ సమీక్ష

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టుల దాడి నేపథ్యంలో తాజా పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం సమీక్షించనున్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టుల దాడి నేపథ్యంలో తాజా పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం సమీక్షించనున్నారు. మావోయిస్టు ప్రభావిత  రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఈ సమావేశానికి ఆహ్వానించారు.

విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే సమావేశానికి కేంద్ర గ్రామీణాభివృధ్ది, విమానయాన, ఉపరితల రవాణా, రైల్వే, విద్యుత్, టెలికం శాఖల మంత్రులు, రాష్ట్రాల కార్యదర్శులు, డీజీపీలు హాజరవుతారు. మావోయిస్టుల్ని దీటుగా ఎదుర్కొనే వ్యూహాల్ని సమావేశంలో ఖరారు చేస్తారని హోం శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement