మూడు పార్టీలకు ఝలక్ ఇచ్చారు | Three MLAs from SP, three from Congress and two from BSP join BJP | Sakshi
Sakshi News home page

మూడు పార్టీలకు ఝలక్ ఇచ్చారు

Aug 11 2016 1:46 PM | Updated on Mar 22 2019 6:17 PM

మూడు పార్టీలకు ఝలక్ ఇచ్చారు - Sakshi

మూడు పార్టీలకు ఝలక్ ఇచ్చారు

శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ ఫిరాయింపులు జోరందుకున్నాయి.

లక్నో: శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ ఫిరాయింపులు జోరందుకున్నాయి. అధికార సమాజ్ వాది పార్టీతో సహా కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాది పార్టీలకు గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూడు పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముగ్గురేసి ఎమ్మెల్యేలు కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఎస్పీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు కూడా బీజేపీలో చేరారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు బీఎస్పీ నాయకులు పార్టీ వదిలిపెట్టారు. బీఎస్పీకి రాజీనామా చేసిన శాసనసభాపక్ష నేత స్వామిప్రసాద్ మౌర్య కూడా ఇటీవల బీజేపీలో చేరారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement