ప్రధాని పర్యటనల వివరాలు ఇవ్వలేం | The details of Prime Minister's visits can not be given | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటనల వివరాలు ఇవ్వలేం

Jul 16 2017 1:10 AM | Updated on Aug 15 2018 2:32 PM

ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విదేశీ పర్యటనలకు వెచ్చించిన వ్యయం వివరాలు వెల్లడించబోమని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) తెలిపింది.

లక్నో: ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విదేశీ పర్యటనలకు వెచ్చించిన వ్యయం వివరాలు వెల్లడించబోమని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) తెలిపింది. సమా చార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా దాఖలైన పిటిషన్‌కు ఈ మేరకు సమాధానమిచ్చింది.

నూతన్‌ ఠాకూర్‌ అనే మహిళ జూన్‌ 16న ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. ఠాకూర్‌ దాఖలు చేసిన దరఖాస్తు అర్థం లేనిదని, ప్రధానుల విదేశీ వ్యయాల వివరాలు ఇవ్వబోమని పీఎంవో కేంద్ర సమాచార అధికారి ప్రవీణ్‌ కుమార్‌ శనివారం స్పష్టం చేశారు. 2010 జనవరి నుంచి ప్రధానుల పర్యటనల గురించి పీఎంవో, ఇతర శాఖల మధ్య మార్పిడి జరిగిన ఫైళ్ల వివరాలను ఇవ్వాలని ఠాకూర్‌ కోరారు. పీఎంవో సమాధానం ఇవ్వక పోవడంతో ఢిల్లీలోని అప్పిలేట్‌ అథారిటీని సంప్ర దిస్తానని ఆమె చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement