ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి | Terror attack on Army camp | Sakshi
Sakshi News home page

ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి

May 29 2018 4:24 AM | Updated on May 29 2018 4:24 AM

Terror attack on Army camp - Sakshi

శ్రీనగర్‌: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఓ జవాను, మరో పౌరుడు మరణించారు. ఆదివారం రాత్రి కాకపోరాలోని 50వ రాష్ట్రీయ రైఫిల్స్‌ క్యాంప్‌పై మిలిటెంట్లు దాడి చేశారని, ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. జవాన్లు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మిలాల్‌ అహ్మద్‌ అనే మరో పౌరుడు గాయపడ్డాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మరణించినట్లు వెల్లడించారు. మరోవైపు, కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో మిలిటెంట్లు జరిపిన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌) దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement