శివుని వేషధారణలో లాలూ పుత్రుడు

Tej Pratap Yadav Dresses Up As Lord Shiva Again Offers Prayers At Temple In Patna - Sakshi

పట్నా: ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి.. ఇంతకు ఎవరాయనంటే.. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌. కొన్ని రోజుల క్రితం విడాకులు కావాలంటూ వార్తల్లోకెక్కిన తేజ్‌ ప్రతాప్‌.. తాజాగా మంగళవారం శివుని వేషధారణలో పాట్నాలోని ఒక ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆయనకు అలాంటి వేషాలు ధరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా కృష్ణుడి వేషధారణలో, మహాభారతంలో కృష్ణుడు పోషించిన పాత్రనే తాను ఇప్పుడు బీహార్‌ రాజకీయాల్లో పోషించబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై, 2018 లో పాట్నాలోని ఒక శివాలయంలో ప్రార్థనలు చేయటానికి తేజ్ ప్రతాప్ శివుని రూపంలో దుస్తులు ధరించి హాజరయ్యారు. శివుని పవిత్ర నివాసాలలో ఒకటైన దేయోఘర్ బాబా బైద్యనాథ్ ధామ్ బయలుదేరే ముందు తేజ్ ప్రతాప్ ప్రార్థనలు చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top